విజయశాంతిగారికి ఇది మేకప్ సమయం – అనిల్ రావిపూడి

Published on Aug 12, 2019 12:58 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన లేడీ అమితాబ్ విజయశాంతి ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు, ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. 13 సంవత్సరాల తరువాత.. విజయశాంతిగారికి ఇది మేకప్ సమయం.. ఈ 13 ఏళ్లలో ఆమె క్రమశిక్షణ, నటన పట్ల ఆమె వైఖరి మరియు ఆమె చైతన్యం ఇలా ఆమెలో ఏదీ మారలేదు.. షూటింగ్ కి స్వాగతం విజయశాంతిగారు’ అని పోస్ట్ చేశారు.

ఇక ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ చాల కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :