విజయ్ “బీస్ట్” హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదల!

విజయ్ “బీస్ట్” హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదల!

Published on Apr 4, 2022 8:10 PM IST

తలపథి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ డ్రామా బీస్ట్. ఈ చిత్రం ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 13 వ తేదీన థియేటర్ల లో భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి విశేష స్పందన లభిస్తోంది.

పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా హిందీ వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నారు మేకర్స్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ అద్దిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు