న్యూఇయర్ రోజున ట్రీట్ ఇవ్వనున్న విజయ్

Published on Nov 22, 2019 1:09 pm IST

బిగిల్’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న విజయ్ తన తర్వాతి సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డిల్లీలో జరుగుతోంది. ఇంకో నాలుగైదు రోజుల్లో ఆ షెడ్యూల్ ముగుస్తుందట. ఇప్పటికే సినిమా టైటిల్ ఏమిటనేది నిర్ణయించారట. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ‘సభవం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

జనవరి 1వ తేదీన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని కూడా అంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా మాళవిక నాయర్‌ కథానాయిక. శాంతను, ఆంథోని వర్గీస్, రమ్యా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ‘బిగిల్’ చిత్రంతో విజయ్, ‘ఖైదీ’ చిత్రంతో లోకేష్ పెద్ద హిట్లు అందుకున్నారు. ఈ రెండు సినిమాలే అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడుతున్నాయి. అందుకే వీరి కలయికలో రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ మీద విపరీతమైన అంచనాలున్నాయి ప్రేక్షకుల్లో.

సంబంధిత సమాచారం :

X
More