విక్రమ్ వేద రీమేక్ లో పవన్… సెట్ అవుతుందా..?

Published on Apr 8, 2020 6:58 am IST

విక్రమ్ వేద తమిళ్ లో వచ్చిన ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీ. విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ గా నిలించింది. గ్యాంగ్ స్టర్ కి పోలీస్ కి మధ్య నడిచే నైతిక యుద్ధమే విక్రమ్ వేద మూవీ. మంచి చెడులను నిర్ణయించడం కష్టం, ఒక్కోసారి మంచి అనుకునేది చెడు కావచ్చు, చెడు అనుకున్నది మంచి కావచ్చు అనే కాన్సెప్ట్ తో దర్శక ద్వయం పుష్కర్, గాయత్రి తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో నటించనుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ మూవీని తెలుగులో నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించాలని చూస్తుండగా పవన్, రవి తేజ లను నటింప చేయాలని భావిస్తున్నారట. కొద్దిరోజులుగా ఈ వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతుండగా విజయ్ సేతుపతి చేసిన స్మగ్లర్ రోల్ పవన్ తో చేయించాలని రామ్ తాళ్లూరి గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. రామ్ తాళ్లూరి పవన్ కి మంచి స్నేహితుడు కావడంతో ఈ సినిమా కోసం ఒప్పించ గలనని నమ్మకంగా ఉన్నాడట. రవితేజ చేత మాధవన్ చేసిన పోలీస్ రోల్ చేయిస్తారట. ఒక వేళ పవన్ ఈ చిత్రంలో ఆ పాత్రకు ఒప్పుకున్నా, ఆయనకు సెట్ అవుతుందా అనే డౌట్ కొడుతోంది.

సంబంధిత సమాచారం :

X
More