అప్పుడే 100 కోట్ల క్లబ్ లో “విక్రమ్” బాక్సాఫీస్ సెన్సేషన్.!

Published on Jun 5, 2022 12:47 pm IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఎలాంటి హీరోయిన్ లేకుండా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సాలిడ్ యాక్షన్ డ్రామా “విక్రమ్”. కమల్ తో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ అలాగే హీరో సూర్య లను కలిపి చేసిన ఈ క్రేజీయెస్ట్ మల్టీ స్టారర్ ఇది. అయితే భారీ అంచనాలు నడుమ వచ్చి సూపర్ టాక్ తెచ్చుకున్నాక వసూళ్ళలో మరింత ఊపు తెచ్చుకుంది.

దీనితో ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ వసూళ్ళని అందుకుంటున్న ఈ చిత్రం లేటెస్ట్ గా అయితే కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్ల క్లబ్ లోకి చేరిపోయినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి అయితే విక్రమ్ మాత్రం భారీ నంబర్స్ సెట్ చేసేలా ఉన్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కమల్ తన బ్యానర్ పై ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :