కమల్ “విక్రమ్” మూవీ రిలీజ్ డేట్ పై ఆరోజే కీలక ప్రకటన!

Published on Mar 3, 2022 5:35 pm IST


బహుముఖ నటుడు కమల్ హాసన్ విజయవంతమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తో విక్రమ్ చిత్రం కోసం చేతులు కలిపాడు. విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ అనే మరో ఇద్దరు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ ఉన్న ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రకటనను సోషల్ మీడియా లో విడుదల చేశారు మేకర్స్.

ప్రకటన ప్రకారం, విక్రమ్ టీమ్, ఈ మల్టీస్టారర్ సినిమా విడుదల తేదీని మార్చి 14, 2022 న ఉదయం 7 గంటలకు ప్రకటించాలని ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేందర్ విక్రమ్ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. యంగ్ సెన్సేషన్, అనిరుధ్ రవిచందర్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :