ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విక్రమ్ “కోబ్రా”..!

Published on Sep 28, 2022 7:02 am IST

తమిళ సినిమా విలక్షణ హీరోల్లో ఒకరైనటువంటి స్టార్ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ” పొన్నియిన్ సెల్వన్” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని కన్నా ముందే విక్రమ్ అయితే హీరోగా నటించిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ “కోబ్రా” రిలీజ్ అయ్యింది. దర్శకుడు అజయ్ జ్ఞాన ముత్తు తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్ పలు గెటప్స్ లో కనిపించారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓవరాల్ గా అయితే థియేటర్స్ లో అనుకున్న స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయితే విక్రమ్ నటన సినిమాలో కొన్ని అంశాలకి మంచి పేరు వచ్చింది. ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్న సోని లీవ్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇక ఈ థ్రిల్లర్ ని అప్పుడు మిస్ అయ్యినవాళ్ళు అయితే ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :