డిసెంబర్ 15న విడుదలవుతున్న విక్రమ్-సమంతల “10” !

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, అక్కినేని సమంత జంటగా నటించగా తమిళంలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకొన్న చిత్రం “10 ఎండ్రాతుకుల్ల”. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని “10” పేరుతో తెలుగులో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టరైజేషన్, సమంత ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. “10” చిత్రం మాస్ ఆడియన్స్ తోపాటు క్లాస్ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంటుందన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. డిసెంబర్ 15న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాలని కోరుకుందాం.