‘విక్రమ్‌’ సక్సెస్ మీట్.. ఆప్యాయంగా వారందరినీ ముద్దాడిన కమల్..!

Published on Jun 19, 2022 1:00 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. మొదటి వారంలోనే సుమారు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టి ఈ సినిమా కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న చిత్రబృందం తాజాగా డిన్నర్ పార్టీని సెలబ్రేట్‌ చేసుకుంది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్‌ హాసన్‌, లోకేష్‌ కనకరాజ్‌, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అయితే విక్రమ్ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు. విక్రమ్‌ సక్సెస్‌ తనపై బాధ్యతను పెంచిందని, ఇకపై మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించేందుకు శ్రమిస్తానని డైరెక్టర్‌ లోకేష్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ డిన్నర్ పార్టీలో హీరో కమల్ హాసన్ లోకేష్‌ కనకరాజ్‌, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్‌లను ఎంతో ప్రేమగా ముద్దాడాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :