విక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్ తిరిగి మొదలైంది

Published on Dec 1, 2020 6:10 pm IST

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మూడు విభిన్న చిత్రాలే. వాటిలో ఒకటి అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్షన్లో చేస్తున్న ‘కోబ్రా’. లాక్ డౌన్ లేకుంటే ఈపాటికి ఈ సినిమా విడుదలయ్యేది. కానీ ఇండస్ట్రీ మూతబడటంతో కనీసం షూటింగ్ కూడ ముగియలేదు. ఇటీవలే లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ సినిమా చిత్రీకరణ కూడా రీస్టార్ట్ అయింది. చెన్నైలోని ఒక స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సైట్లో ఈ సినిమా మొదలైంది.

ఈ షెడ్యూల్ ముగిశాక టీమ్ కొత్త షెడ్యూల్ కోసం రష్యా వెళ్లనున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడ ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతుంది.
వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సుమారు 30 రకాల వేషధారణల్లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని వీలైనంతవరకు 2021 మొదటి అర్థభాగంలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ సినిమాపై విక్రమ్ అభిమానుల్లోనే కాదు సినీ ప్రేమికులందరిలోనూ మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More