మూడు భాగాలుగా రిలీజ్ కానున్న స్టార్ హీరో సినిమా !
Published on Nov 1, 2017 12:37 pm IST

దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన చియాన్ విక్రమ్ ప్రస్తుతం తమిళంలో స్టార్ డార్కెటర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నచ్చత్తిరం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ వర్గాలు కూడా సినిమా స్టైలిష్ గా, కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ఇకపోతే తాజా సమాచారం మేరకు ఈ సినిమాను మూడు భాగాలుగా విడుదలచేయాలని అనుకుంటున్నాడట గౌతమ్ మీనన్. అయితే అవి ఏవిధంగా ఉంటాయి అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook