ఆ స్టార్ హీరో సినిమా డీటైల్స్ త్వరలోనే

Published on Nov 21, 2019 2:00 am IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈమధ్యే తన 58వ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ క్రిస్టమస్ సందర్బంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై నిర్మాతల నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం 2020కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ చిత్రంలో విక్రమ్ సుమారు 25 భిన్నమైన వేషధారణల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

More