బాలయ్య సినిమాకు ఒక సమస్య తీరినా ఇంకొకటి అలానే ఉంది

Published on Dec 2, 2020 4:00 am IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. లాక్ డౌన్ ముగియండంతో సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. శరవేగంగా జరుగుతోంది. మొదటి నుండి ఈ సినిమాను రెండు సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటి హీరోయిన్ కాగా ఇంకొకటి విలన్. ఈ పాత్రల కోసం నటీనటుల్ని ఎంపిక చేయడం కోసం చాలానే కష్టపడుతున్నారు.

అనేక తర్జనభర్జనల తర్వాత కథానాయికలుగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణలను ఫైనల్ చేశారు. కానీ ఇప్పటికీ విలన్ సమస్య తీరలేదు. బాలయ్యను ఢీకొట్టడానికి మొదట్లో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను అనుకున్నారు. కానీ సంజయ్ ఆరోగ్యం డిస్టర్బ్ కావడం, ఆయన చికిత్స కోసం వెళ్లడంతో ఆ ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. ట్రీట్మెంట్ పూర్తైనా కూడ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఎక్కువ సినిమాలకు సైన్ చెయ్యట్లేదు. ఆయన తరవాత పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ ఇప్పటికీ ఎవ్వరూ సెట్ కాలేదట. మరి ఇంతలా వెతుకుతున్న బోయపాటి చివరికి ఎవరిని తీసుకొస్తారో చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More