సర్కారు వారి ఫస్ట్ లుక్..ఒక్క మాటలో వింటేజ్ బాబు ఈజ్ బ్యాక్.!

Published on Jul 31, 2021 4:13 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ కోసం సోషల్ మీడియా అంతా ఒక రేంజ్ లో ఊగుతుంది. ఓ పక్క చిత్ర యూనిట్ అలెర్ట్ పోస్టులతో అదరగొడుతుండగా మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. సో ఫైనల్ గా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎట్టకేలకు వచ్చేసింది.

ఇది మాత్రం చూసాక మేకర్స్ ముందు నుంచి చెప్తున్నా మాట నిజమే అని చెప్పాలి. మహేష్ అభిమానులకు పూర్వ వైభవం ఇచ్చేలా మహేష్ లుక్స్ ఇందులో సిద్ధం చేసినట్టుగా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. చాలా స్టైలిష్ డ్రెస్సింగ్ అలాగే ఆ హెయిర్ స్టయిల్ చూస్తే పోకిరి, అతిథి టైం మహేష్ బాబు గుర్తు రాక మానడు. మహేష్ అభిమానులు కూడా అలాంటి లుక్ కోసమే చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇది చూసాక మాత్రం వాళ్ళకి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. అలాగే ఇదే పోస్టర్ దుబాయ్ లోని ప్లాన్ చేసిన సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ అన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 13 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా మరోపక్క వచ్చే ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా సిసలైన బ్లాస్ట్ ను దర్శకుడు పరశురామ్ పెట్ల ప్లాన్ చేసారని కన్ఫర్మ్ చేసారు.

మొత్తానికి మాత్రం పెట్ల ఈ సినిమాతో అదిరే ట్రీట్ ఇవ్వడం పక్కా అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సహా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :