బజ్..”రాధే శ్యామ్” రిలీజ్ అప్పటికి షిఫ్ట్ అయ్యిందా.?

Published on Jul 29, 2021 2:00 pm IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం షూట్ కూడా మొత్తం పూర్తయ్యినట్టుగా దర్శకుడు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

అంతే కాకుండా కొత్త అప్డేట్ కూడా తొందరలోనే వదులుతున్నట్టు కన్ఫర్మ్ చేసారు. అయితే ఈ చిత్రం రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ అవుతుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోకి షిఫ్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

ఇప్పటికే ఇంకో రెండు రోజుల్లో ఓ సాలిడ్ అప్డేట్ ఇస్తామని మేకర్స్ చెబుతున్నారు మరి అందులో ఏమన్నా పొదుపరుస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి మొత్తం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :