వైరల్ : జపాన్ లో “గేమ్ చేంజర్” క్రేజ్.!

వైరల్ : జపాన్ లో “గేమ్ చేంజర్” క్రేజ్.!

Published on Mar 29, 2024 2:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే చరణ్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ జరగండి ని రిలీజ్ చేశారు. మరి దీనికి డీసెంట్ రెస్పాన్స్ నే అందుకోగా లేటెస్ట్ గా ఈ సాంగ్ కి చరణ్ ఫ్యాన్స్ మన దగ్గర ఫ్యాన్స్ కాదు కానీ జపాన్ లో ఓ లేడీ ఫ్యాన్ చరణ్ కి కటౌట్ పెట్టి మరీ సెలెబ్రేట్ చేస్తున్నారు.

దీనితో మేకర్స్ ఈ పిక్స్ తో తమ సాంగ్ రీచ్ కి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆన్లైన్ లో అయితే భారీ రెస్పాన్స్ రాలేదు కానీ ఆఫ్ లైన్ లో మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఈ సాంగ్ ఇస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఎస్ జె సూర్య, అంజలి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు