వైరల్ : అర్జున్, మాస్ కా దాస్ సినిమా లాంచ్ చేసిన పవన్.!

Published on Jun 23, 2022 11:11 am IST

అనుకున్నట్టుగానే టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 11వ చిత్రం మాత్రం చాలా గ్రాండ్ వే లోనే వెళుతూ వస్తుంది. రీసెంట్ గా రెండు భారీ అనౌన్సమెంట్ లుతో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ చిత్రం కోసం ఇప్పుడు మేకర్స్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపారు. ప్రముఖ స్టార్ నటుడు అర్జున్ సార్జా దర్శకునిగా చేస్తున్న విశ్వక్ సేన్ సినిమా ఈరోజు హైదరాబాద్ లో అట్టహాసంగా ముహూర్తం జరుపుకుంది.

ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా హాజరయ్యారు. అలాగే ఈ చిత్రానికి పవన్ ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి ఆల్ది బెస్ట్ చెప్పగా ఇప్పుడు పవన్ ఈ చిత్ర యూనిట్ తో కలిసి ఉన్న ఫోటోలు మాత్రం మంచి వైరల్ గా మారిపోయాయి. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :