వైరల్ : ఆస్ట్రేలియన్స్ లో “పుష్ప” మాస్ క్రేజ్.!

Published on Mar 4, 2023 10:04 am IST

మన టాలీవుడ్ ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ ని సెట్ చెయ్యడంలో అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. తన డ్రెస్సింగ్ తో కానీ హెయిర్ స్టైల్ తో గాని ప్రతి సినిమాకి అదరగొట్టే ఐకాన్ స్టార్ లేటెస్ట్ గా అయితే తన మాసివ్ హిట్ చిత్రం “పుష్ప” తో సెన్సేషన్ ని సెట్ చేసాడు. ఆ సినిమాలో తాను చేసిన తగ్గేదేలే మ్యానరిజం అయితే ఇప్పటికీ ట్రెండ్. అనేకమంది స్టార్ క్రికెటర్స్ ఇదే మ్యానరిజం ని ఫాలో అయ్యారు.

ఇక ఇండియన్ క్రికెటర్స్ లో చాలా మంది చేయగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ లో అయితే డేవిడ్ వార్నర్ చేసాడు. మరి అక్కడ నుంచి అది వారి ఆడియెన్స్ లోకి కూడా వెళ్ళిపోయింది. లేటెస్ట్ గా జరుగుతున్నా సిరీస్ లో అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆస్ట్రేలియన్ కుర్రాడు తగ్గేదేలే అంటూ చేసిన మ్యానరిజం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ఐకాన్ స్టార్ దెబ్బ కొడితే అచ్చు అలా ఉండిపోయిందని చెప్పాలి. మరి నెక్స్ట్ పుష్ప 2 తో ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :