వైరల్ అవుతోన్న బాలయ్య అభిమాని “శుభలేఖ’ !

Published on May 7, 2019 3:44 am IST


ఏమైనా బాలయ్య రేంజ్ వేరు. అలాగే బాలయ్య అభిమానాల ఆలోచనలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. బాలయ్య పై ఓ అభిమాని తన వీరాభిమానాన్ని చాటుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. సహజంగా వివాహ శుభలేఖల మీద దేవుళ్ల ఫోటోలు ప్రచురిస్తారు.

కానీ ఓ పెళ్లి కార్డు మీద మాత్రం ప్రముఖంగా వెంకటేశ్వర స్వామి గెటప్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ కనిపిస్తున్నారు. కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు అనే బాలయ్య అభిమాని తన కుమారుడి వివాహాన్ని మే 13న పెట్టుకున్నాడు.

కాగా ఆ వివాహా శుభలేఖలో బాలయ్య బొమ్మను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. పైగా నందమూరి అభిమానులంతా తన కొడుకు పెళ్లికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం కూడా పంపాడు. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతొంది.

సంబంధిత సమాచారం :

More