కేరళలో విరాటపర్వం..!

Published on Jan 19, 2020 5:29 pm IST

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. పీరియాడిక్ స్టోరీగా ఓ ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి పల్లవి ఈ చిత్రంలో సామజిక గాయకురాలిగా, నక్సలిస్ట్ గా కనిపించనుంది. ఇక రానా పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం కేరళలో జరుగుతుందట . అక్కడ దట్టమైన అరణ్యాలలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. విరాట పర్వం చిత్రంలో సాయి పల్లవి,రానా ల పాత్రలు చాల ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తుంది.

దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్ ప్రియమణి ఓ కీలక రోల్ చేస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులు వాయిదాపడింది. రానా దగ్గుబాటి వ్యక్తిగత కారణాల రీత్యా అమెరికాలో రెండు నెలలకు పైగా గడిపారు. దీనితో ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది.

సంబంధిత సమాచారం :

X
More