మహేష్ టైటిల్ తో విశాల్!

15th, November 2017 - 11:55:36 PM

తాజాగా డిటెక్టివ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. స‌మంత తో విశాల్ నటిస్తోన్న త‌మిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ తెలుగులో అనువాదం అవుతోంది. ఈ సినిమాకు అభిమన్యు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. గతంలో మహేష్ బాబు మురుగదాస్ చిత్రానికి ఈ టైటిల్ ఫిక్స్ చేసారు.

హీరో అర్జున్ ఈ సినిమాలో విశాల్ కు ప్ర‌తినాయ‌కుడిగా నటిస్తోన్నాడు. మిత్ర‌న్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. విశాల్ కు ఈ సినిమా మంచి విజయవంతం అవ్వాలని కోరుకుందాం.