విశాల్ “టెంపర్” ని కూడా చూపిస్తారంట.

Published on May 26, 2019 12:00 am IST

పూరి జ‌గ‌న్నాథ్‌, ఎన్టీఆర్ కంబినేషన్లో వచ్చిన “టెంప‌ర్‌” మంచివిజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో సక్సస్ కొట్టిన టెంపర్ ని రణ్వీర్ సింగ్ హిందీలో “సింబా” పేరుతొ చేయగా అక్కడకూడా సూపర్ హిట్ ఐయ్యింది. ఇటీవల విడుదలైన విశాల్ నటించిన “టెంప‌ర్‌” తమిళ రీమేక్ “అయోగ్య” కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పోలీస్ ఆఫీస‌ర్‌గా విశాల్ త‌న విశ్వ‌రూపం చూపించాడు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రానికి అభిమానులు, క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని మేకర్స్ అనుకుంటున్నార‌ట‌. మ‌ల్కాపురం శివ కుమార్ తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ ద‌క్కించుకోగా, జూన్‌లో మూవీ విడుద‌ల చేయ‌నున్నారు. అయోగ్య చిత్రం చివ‌రి గంటలో వ‌చ్చే సీన్స్ అన్నింటిని పూర్తిగా మార్చేశార‌ట‌. ఇవి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా మంచి వినోదం అందిస్తాయ‌ని భావిస్తున్న నేప‌థ్యంలో అయోగ్య చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు

సంబంధిత సమాచారం :

More