స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరో విశాల్ !
Published on Nov 22, 2017 9:18 am IST

తమిళ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూ పరిశ్రమ లోపల దాగి ఉన్న సమస్యల్ని బయటపెడుతున్నాయి. తాజాగా నిన్న పలు చిత్రాలకు, ముఖ్యంగా హీరో శశి కుమార్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహిరించిన బి. అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆయన మరణానికి ఫైనాన్షియర్ల వేధింపులే కారణమని స్పష్టమైంది. అప్పులిచ్చిన ఫైనాన్షియర్లు వేధింపులకు గురిచేయడం వలనే ఆయన సూసైడ్ చేసుకున్నారు.

ఈ విచషయంపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూజర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, హీరో విశాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. పరిశ్రమలో ఇదే ఆఖరి బలన్మరణం కావాలని, ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి నిర్మాతల్ని వేదించే ఫైనాన్షియర్ల ఆగడాలు ఇక సాగవని, అలాంటి వారెవరైనా ఉంటే పద్దతిని మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేగాక అశోక్ కుమార్ మరణాన్ని హత్యగా భావించి సదరు ఫైనాన్షియర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్నప్తి చేశారాయన.

 
Like us on Facebook