విశాల్ ‘టెంపర్’ బాగా వస్తుందట !

విశాల్ ‘టెంపర్’ బాగా వస్తుందట !

Published on Oct 8, 2018 8:37 AM IST

ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. వరుసగా ప్లాప్ లతో సతమవుతున్న ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం టెంపర్ కావడం విశేషం. అయితే ఈ చిత్రం రీమేక్ రూపంలో తమిళ్ లోకి కూడా వెళ్ళబోతుందని తెలిసిన విషయమే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్ ను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం చాలా బాగా వస్తుందని చెబుతుంది చిత్రబృందం. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బాగా అలరిస్తాయట.

ఇక త్వరలో జరగనున్న షెడ్యూల్ లో ఓ బీచ్ సాంగ్ ని కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది . ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అయోగ్య’ అనే పేరుతో ఈ చిత్రం రాబోతుంది. మరి ఎన్టీఆర్ కి హిట్ ఇచ్చిన పోలీస్ స్టోరీ, విశాల్ కి కూడా హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు