కవల పిల్లలకు నామకరణం చేసిన మంచు విష్ణు

కవల పిల్లలకు నామకరణం చేసిన మంచు విష్ణు

Published on Dec 24, 2011 7:30 PM IST


“డిసంబర్ 2 న నాకు మరియు విని కి కవల ఆడ పిల్లలు పుట్టారు. దేవుడి దయ వళ్ళ నేను, విని మరియు మా పిల్లలు బాగున్నాము. గత మూడు వారాలుగా నాకు మరియు మా కుటుంబ సభ్యులకు వచ్చిన వందలాది అభినందనలు నాకు చాలా ఆనందం కలిగించాయి. మా పిల్లలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు న కృతజ్ఞతలు. ఈ క్షణం నా జీవితం లో మరిచిపోలేని క్షణం. ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మా పిల్లలు పుట్టినప్పుడు విని కళ్ళలో ఆనంద బాష్పాలు చూసాను. మా అమ్మ ప్రేమ,విని తల్లి తండ్రులు నేను ఆపరేషన్ ధియేటర్ నుండి బయటకు రాగానే విని ఎలా ఉంది అని అడగటం. మొదటగా డైపర్ మార్చినపుడు లక్ష్మి సహాయం , మనోజ్ ముందు పారిపోయిన మళ్ళి తను కూడా డైపర్ మార్చటం లో సహాయం చేయటం అన్ని తీపి జ్ఞాపకాలుగా మనస్సుల్లో నిలిచిపోయాయి.

జీవితం ఒక్కసారిగా కాంతివంతంగా మరియు సంతోషకరంగా మారిపోయింది. ఇప్పుడు నా జీవితానికి రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కాకుండా విని కాన్పు ను న్యూ యార్క్ లో చేయటం మీద చాలా మంది పెదవి విరిచారు. కాని విని తను పుట్ట్టిన చోటే తన పిల్లలు పుట్టాలని కోరుకోటం మూలాన ఇలా చెయ్యాల్సి వచ్చింది. హైదరాబాద్ లో కాన్పు జరిగి వుంటే అటు మంచు కుటుంబ సభ్యులు మరియు వై.ఎస్ కుటుంబ సభ్యుల రాకతో పిల్లలతో గడపటం కష్టం అయ్యుండేది. ఇప్పుడు ప్రతి చిన్న క్షణాన్ని పిల్లలతో గడపుతున్నాను. నేను ఒక పెద్ద దర్శకుడి చిత్రాన్ని వదులుకున్న విషయం చాలా మందికి తెలియదు ఆ చిత్రం ఒప్పుకొని ఉంటే మూడు రోజులకు మించి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పారు. కాని పిల్లలు పుట్టేపుడు దగ్గర వుండటం ఆ అనుబూతి పొందిన వారికే తెలుస్తుంది నాకు ఇంకా వయసుంది నేను సినిమాలు చెయ్యటానికే పుట్టాను కాబట్టి ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందనే అనుకుంటున్నా. నా పరిస్థితి ని ఆ దర్శకుడు అర్ధం చేసుకుంటాడని అనుకుంటున్నా.

నాన్నగారి ఆశీర్వాదం తో మా పిల్లలకు “ఆరియాన మంచు” మరియు “వివియాన మంచు” అని నామకరణం చేశాము. వాళ్ళు ఇద్దరికి నాలాగే సొట్ట బుగ్గలున్నాయి. కాని విని పోలికలే ఎక్కువగా వున్నాయి. ఒక పాప నాలాగా వుండగా ఇంకొక పాప విని లాగా ఉంది . పిల్లలు విని నుండి తెలివి ని , నాన్నగారి నుండి దయ మరియు ప్రతిభ ని , అమ్మ నుండి ఓపిక ను , లక్ష్మి నుండి దైర్యాన్ని, మనోజ్ నుండి చిలిపితనాన్ని, నా నుండి పొడవు(కాస్త తక్కువగా) తెచ్చుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. మా నాన్నలో పది శాతం నాన్నగా వున్నా నేను గొప్ప తండ్రి అవుతాను. “అరి” మరియు “వివి” ల కు ఆశీర్వాదం అందించినందుకు కృతజ్ఞతలు” అని విష్ణు ఈరోజు ప్రెస్ నోట్ విడుదల చేసారు.


రవి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు