
కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు యువ టాలెంట్ ని ప్రోత్సహించడం కోసం షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ని ప్రకటించిన విషయం తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం ఈ షార్ట్ ఫిలిమ్స్ కి న్యాయనిర్ణేతలుగా రామ్ గోపాల్ వర్మ, దేవా కట్టా, దశరధ్, బి.వి.ఎస్ రవి వ్యవహరించనున్నారు.
ఈ కాంటెస్ట్ లో గెలిచిన వారికి లక్ష రూపాయిలు క్యాష్ ప్రైజే కాకుండా 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో డైరెక్ట్ గా సినిమా తీసే అవకాశం కూడా లభిస్తుంది. ఈ కాంటెస్ట్ కి వచ్చిన రెస్పాన్స్ అద్భుతమని మంచు విష్ణు తెలిపారు.

