ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విశ్వక్సేన్ ‘గామి’

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విశ్వక్సేన్ ‘గామి’

Published on Apr 12, 2024 2:00 AM IST

యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ గామి. విభిన్న కథ కథనాలతో ఆకట్టుకునే రీతిన రూపొందిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ విజయం సొంతం చేసుకుంది.

కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీలో అభినయ, హారిక పెద్ద, దయానంద్ రెడ్డి, మొహమ్మద్ సమద్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు. విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా తెలుగు, తమిళ, కన్నడ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోని ఈ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఎంత మేర స్పందన లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు