విశ్వక్‌సేన్ రీమేక్ మూవీపై అప్డేట్ ఏమంటే..!

Published on Jul 21, 2021 1:16 am IST

త‌మిళంలో సూప‌ర్ హిట్ చిత్రం ‘ఓ మై క‌డ‌వులే,ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా త‌మిళంలో ఒరిజినల్‌ను దర్శకత్వం చేసిన అశ్వ‌థ్ మారిముత్తే తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. పీవీపీ సినిమాస్, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ రీమేక్‌కి సంబంధించి విశ్వక్‌సేన్ ఓ అప్డేట్‌ను ఇచ్చారు.

అయితే అద్బుత‌మైన టాలెంట్ క‌లిగిన టీంతో 18 రోజుల షూటింగ్ ముగిసిందని, 3 రోజుల స్వ‌ల్ప విరామం త‌ర్వాత మ‌ళ్లీ సెట్స్ లో క‌లుద్దాం అంటూ టీంతో దిగిన ఫోటోను విశ్వక్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో రితికాసింగ్ పోషించిన ఫీమేల్ లీడ్ రోల్‌లో బాలీవుడ్ న‌టి మిథిలా పాల్క‌ర్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :