మరింత గ్రాండ్ గా మారుతున్న విశ్వక్ నెక్స్ట్..ఊహించని మ్యూజిషియన్.!

Published on Jun 22, 2022 10:10 am IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకడు. అయితే విశ్వక్ సేన్ హీరోగా ప్రముఖ స్టార్ నటుడు అర్జున్ సార్జా దర్శకత్వంలో ఫస్ట్ టైం చేయబోతున్న సినిమాగా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది.

అయితే మొదట స్టార్ట్ అవ్వడమే అనౌన్సమెంట్ నుంచి స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు మరింత గ్రాండ్ గా మారిపోతుంది అని చెప్పాలి. నిన్ననే స్టార్ రచయిత్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి ఓకే కాగా ఇప్పుడు ఏకంగా ఓ ఊహించని సంగీత దర్శకుడు లైన్ లోకి వచ్చినట్టుగా అనౌన్స్ అయ్యింది.

ఆ సంగీత దర్శకు మరెవరో కాదు కన్నడ లో “కేజీయఫ్” సినిమాలకి క్రేజీ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు రవి బసృర్. ఇతను ఇప్పుడు విశ్వక్ సినిమాకి అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. మరి ఇవన్నీ చూస్తుంటే సినిమా మరింత గ్రాండ్ గా వెళ్లేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :