విశ్వక్ సేన్ “ధమ్కీ” రిలీజ్ డేట్ ఫిక్స్!

విశ్వక్ సేన్ “ధమ్కీ” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Nov 24, 2022 11:20 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమ్కీ. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ఈ పాన్ ఇండియన్ మూవీ ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విషయాన్ని ప్రకటించేందుకు మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు