“విరాట పర్వం” నుండి వాయిస్ ఆఫ్ రవన్న విడుదల…ట్రైలర్ పై వచ్చిన క్లారిటీ!

Published on Dec 14, 2021 10:35 am IST

రానా దగ్గుపాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న చిత్రం విరాట పర్వము. సురేష్ ప్రొడక్షన్స్ మరియు SLV సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేయడం జరిగింది.

రానా దగ్గుపాటి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి వాయిస్ ఆఫ్ రవన్న పేరిట ఒక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ వచ్చే సంక్రాంతి పండుగ కి విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :