జూన్ లో రానున్న ఓటర్ !

Published on May 26, 2019 8:05 pm IST

జిఎస్ కార్తీక్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓటర్’. ఎప్పుడో విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకు మధ్యలో కొన్ని వివాదాలు చుట్టిముట్టాయి. అయితే ఎట్టకేలకూ ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. జూన్ లో విడుదల కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకి సెన్సార్ కంప్లీట్ అయింది. ఓటర్ కు యు/ఎ సర్టిఫికేట్ లభించింది.

రాజకీయాల్లోని పూలు అంశాలాను ప్రస్తావిస్తూ.. తెరకెక్కిన ఈ సినిమా ముఖ్యమైన మరియు కీలకమైన కొన్ని అంశాలను చర్చించారు. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో మంచు విష్ణు పలికిన డైలాగ్స్ కూడా ఓటర్ పై నమ్మకం కలిగించాయి. ‘అహింసా మార్గం ద్వారా..ఒక్క బులెట్ కూడా కాల్చకుండా.. స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది..’ ‘మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు..’ ‘మార్పు మనలో రావాలి..మారాలి.. మార్చాలి. లాంటి మాటలు ఆకట్టుకున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా ఇలాగే ఉంటుందట. ఇక ఈ సినిమాను ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జాన్‌సుధీర్ పూదోట సినిమాను నిర్మించారు. థమన్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :

More