మహేష్, పవన్‌తో టచ్లో ఉన్నానంటున్న స్టార్ డైరెక్టర్

Published on Oct 21, 2020 7:50 am IST


ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ డైరెక్టర్లలో వివి.వినాయక్ ఒకరు. ‘ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, ఖైదీ నెం 150’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఈయన ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతోనూ వర్క్ చేశారు కానీ మహేష్ బాబు, పవన్‌తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. మహేష్, పవన్ అభిమానులు ఛాన్నాళ్ళ నుండి వినాయక్ డైరెక్షన్లో తమ హీరోలు సినిమాలు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే వినాయక్ పక్కా కమర్షియల్ డైరెక్టర్. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. ఆయనతో సినిమా అంటే మాస్ ప్రియులకు పండుగలా ఉంటుంది. మహేష్, పవన్‌తో వర్క్ చేయాలనే కోరిక వినాయక్ మనసులో కూడ ఉంది.

ఈ విషయాన్ని తాజాగా ఒక ఒక్క మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఆయన. అందరితోనూ వర్క్ చేసిన తనకు వారిద్దరితో కూడ సినిమాలు చేయాలని ఉందని, కానీ టైమ్ సెట్ కావట్లేదని, ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు హీరోలతో టచ్లోనే ఉంటున్నానని అన్నారు. అంటే అన్నీ కలిసొస్తే వినాయక్ దర్శకత్వంలో మహేష్, పవన్‌లను చూసే అవకాశం ఉందన్నమాట. ఇకపోతే ప్రస్తుతం వినాయక్ మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయడానికి సిద్దమవుతుండగా మహేష్ ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని, పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More