సినీ కార్మికులకు వివి.వినాయక్ విరాళం

Published on Mar 26, 2020 3:22 pm IST

కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ మొత్తం నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వేతనాలు లేక నిత్యావసరాలకు కూడా ఇబ్బందిపడేవారున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని సినీ పెద్దలు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే కొందరు స్టార్లు సినీ కార్మికుల కోసం తమవంతుగా విరాళాలు అందించగా తాజాగా దర్శకుడు వివి.వినాయక్ తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందించారు.

ఈ చెక్కును నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న మనం సైతం ఫౌండేషన్ కు అందించారు. సినీ కార్మికులు ఎవరైనా సరే నిత్యావసరాలకు ఇబ్బందిపడుతుంటే నేరుగా కాదంబరి కిరణ్ ను సంప్రదించి సహకారం పొందవచ్చని అన్నారు. అలాగే ప్రజలంతా ఇళ్లకే పరిమితమై, కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇకపోతే వినాయక్ ప్రజెంట్ ‘సీనయ్య’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More