అక్కినేని అఖిల్ ఇంకా హీరోకాకపోయినా ప్రస్తుత తరం నటులలో ఫేమస్ అయిన స్టార్. అక్కినేని వంశంనుండి రాబోతున్న ఈ యువ రక్తం తెరారంగ్రేటం పై ఇండస్ట్రీ కళ్ళంతా. మే 23 న విడుదలైన ‘మనం’ సినిమాలో తళుక్కున మెరవడంతో ప్రతీఒక్కరూ ముక్తకంటంతో అఖిల్ కి పెద్దహీరో అయ్యే అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా వున్నాయని కీర్తించారు
అప్పటినుండి అఖిల్ డెబ్యు చిత్రంపై, దాని దర్శకుడిపై పలు పుకార్లు వినిపిస్తూనే వున్నాయి, అయితే తాజాగా వీటన్నిటికీ కాలంచెల్లినట్టు సమాచారం. ఎందుకంటే అఖిల్ మొదటి చిత్రాన్ని కమర్షియల్ సక్సెస్ ని ఒంటబట్టించుకున్న వి.వి వినాయక్ చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది. అఖిల్ చెప్పినట్టు ‘ఒక లైలా కోసం’ విడుదల తరువాత అధికారిక ప్రకటన చేసే అవకాశం వుంది.


