వైరల్ అవుతోన్న స్టార్ డైరెక్టర్ న్యూ పిక్ !

Published on Jul 15, 2019 8:20 am IST

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం వినాయక్ జిమ్‌ లో కష్టపడుతున్న ఓ పిక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వినాయక్ తన లుక్ కోసం జిమ్‌ లో గంటలు తరపడి కసరత్తులు చేస్తున్నారట, ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మొదటగా వినాయక్ పార్ట్ షూట్ చేయనున్నారు.

కాగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వినాయక్ చాల సన్నగా కనబడాలట. ఆ సన్నివేశాలనే రెండో షెడ్యూల్ లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో వినాయక్ బాడీని ఇంకా తగ్గించటానికి తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా నరసింహారావు వ్యవహరించనున్నారట. ఈయన గతంలో శరభ అనే సినిమాని తీశారు.

సంబంధిత సమాచారం :

X
More