వివిఆర్ తమిళ , మలయాళ టీజర్లు విడుదల !

Published on Jan 26, 2019 1:00 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఇటీవల విడుదలై రామ్ చరణ్ కెరీర్లో ఆరెంజ్ , తుపాన్ చిత్రాల తరువాత మరో డిజాస్టర్ గా మిగిలింది. అయితే విపరీతమైన నెగిటివ్ టాక్ ను సైతం తట్టుకొని ఈ చిత్రం 60కోట్లషేర్ ను రాబట్టింది.

ఇక ఈ చిత్రం ఇప్పుడు తమిళ ,మలయాళ భాషల్లో విడుదలకానుంది. ప్రకాష్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈచిత్రం యొక్క తమిళ , మలయాళ టీజర్ లు విడుదలయ్యాయి. త్వరలోనే ఈచిత్రం అక్కడ విడుదలకానుంది.

మరి తెలుగులో డిజాస్టర్ అయినా ఈచిత్రం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతంఅందించారు.

మలయాళ టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తమిళ టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More