‘వార్ – 2’ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీకి టైం ఫిక్స్ ?

‘వార్ – 2’ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీకి టైం ఫిక్స్ ?

Published on Apr 11, 2024 3:00 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర పార్ట్ 1 మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న వార్ 2 మూవీ కూడా చేసేందుకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్.

ఈ మూవీ యొక్క షూట్ ఇటీవల ప్రారంభం కాగా, హృతిక్ రోషన్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే పలు సీన్స్ చిత్రీకరించారు. విషయం ఏమిటంటే, రేపటి నుండి ఈ మూవీకి సంబందించిన సెట్స్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారట. కాగా ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వార్ 2 గురించి మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు