ట్రైలర్: గురు శిష్యుల మధ్య సాగే డెడ్లీ “వార్”

Published on Aug 27, 2019 12:39 pm IST


బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ వార్. దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

కాగా కొద్దిసేపటి క్రితం విడుదలైన వార్ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో రిచ్ గా ఉంది. భారత్ ఏజెంట్ గా పనిచేసి క్రిమినల్ గా మారిన కబీర్ గా హృతిక్ కనిపిస్తుండగా, అతన్ని వెంటాడే శిష్యుడి పాత్రలో జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. గురు శిష్యులైన హృతిక్, జాకీ ల మధ్య నడిచే డెడ్లీ వార్ సినిమా ప్రధానాంశంగా కనబడుతుంది. ఐతే హృతిక్ 2013లో వచ్చిన క్రిష్ 3 తరువాత ఒక ఫుల్ టైం యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. సాహస వీరుల గెటప్స్ లో ఇద్దరు హీరోలు ఒక రేంజ్ లో ఉన్నారు.

వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ మరియు శేఖర్ అందిస్తన్నారు. అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో విడుదల అవుతుంది. అదే రోజు చిరంజీవి సైరా విడుదల ఉండటం గమనార్హం.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :