సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటించిన ‘లవర్స్’ గత శుక్రవారం విడుదలై విజయం సాదించింది. ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో సప్తగిరి కామెడీకి మంచి పేరొచ్చింది. మగజాతి ఆణిముత్యం పాత్రలో నెల్లూరు యాసలో సప్తగిరి పండించిన వినోదం థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సప్తగిరి నటించిన కొన్ని సన్నివేశాలకు అసలు స్క్రిప్ట్ లేదట. హీరో సుమంత్ అశ్విన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
సినిమాటోగ్రాఫర్ కెమెరా యాంగిల్ ఫిక్స్ చేసి పెట్టేవారు. నాకు, సాయి, సప్తగిరిలకు కాన్సెప్ట్ వివరించి చెప్పేవారు. డైలాగులు గట్రా ఏమి లేవు. ఆన్ సెట్స్ మాకు ఏది చేయాలి అనిపిస్తే అది చేశాం. ఆ సన్నివేశాలలో డైలాగులు కూడా స్పాంటేనియస్ గా చెప్పినవే. థియేటర్లో ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అని హీరో సుమంత్ అశ్విన్ చెప్పారు. చాలా సన్నివేశాలు సింగిల్ టేక్ చేశాం అని అన్నారు. మారుతి కథ, స్క్రీన్-ప్లే, మాటలతో పాటు హరి దర్శకత్వం విజయంలో ముఖ్య భూమిక పోషించాయని సుమంత్ అశ్విన్ తెలిపారు.
