ఇండియాలో సినిమా హీరోలకి, సినిమా రిలీజ్ లకి ఎంత క్రేజ్ ఉందో అంతే క్రేజ్ క్రికెట్ మ్యాచ్ లకి, క్రికెట్ స్టార్స్ కి కూడా ఉంది. ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే సినిమా అన్నా, క్రికెట్ అన్నా మరీ ఎక్కువ ఆసక్తి. ఈ రోజు ఇండియాతో పాటు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. దాంతో దాదాపు అందరు టీవీల ముందు ఉండిపోయారు.
దీనివల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్స్ కి వెళ్ళే వారు ఖరువైపోతారు. దాంతో ఈ రోజు సాయంత్రం వరకు థియేటర్స్ అన్నీ వెలవెలబోవాల్సిందే.. దీంతో కొనతమంది ఎగ్జిబిటర్స్ మార్నింగ్ షౌస్ ని కాన్సల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా చిన్న చిన్న టౌన్స్ లో షోస్ కాన్సల్ చేసేసారు. క్రికెట్ లోనే టఫ్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా – ఇండియాల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుండడంతో అందరూ మ్యాచ్ అయ్యే వరకూ బయటకి వచ్చేలా కనపడడం లేదు. ఇకపోతే రేయ్, జిల్ సినిమాలు రేపు రిలీజ్ కానుండడంతో వాటికి పెద్ద ఇబ్బంది కలగడం లేదు.


