సెన్సార్ కి సిద్దమవుతున్న ‘వీకెండ్ లవ్’
Published on Jul 19, 2014 8:00 am IST

Weekend-Love-Movie
అదిత్, సుప్రియా శైలజా హీరో హీరోయిన్లుగా దృష్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తోట మధు నిర్మించిన చిత్రం ‘వీకెండ్ లవ్’. ఫిల్మ్ జర్నలిస్ట్‌ నాగు గవర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ‘వీకెండ్ లవ్’ ఈ వారంలో సెన్సార్ కి సిద్దమవుతుంది. ఆగస్ట్ నెల మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్వర్గీయ శ్రీహరి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. వీకెండ్స్ లో యువత ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది. అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం శ్రోతలకు చేరువైంది. చంద్ర మోహన్, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, తాగుబోతు రమేష్ తదితర హాస్య నటులు ఈ చిత్రంలో నటించారు.

 
Like us on Facebook