‘నారప్ప’గా మారిపోయిన విక్టరీ వెంకటేష్ !

Published on Jan 21, 2020 11:00 pm IST

తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే టైటిల్ ను పెట్టారు.

కాగా ఈ టైటిలే పరిశీలనలో ఉన్నట్టు మేము గతంలోనే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పోస్టర్స్ లో వెంకటేష్ లుక్ అండ్ గెటప్ వెరీ మాస్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. నెల రోజుల పాటు అక్కడే షూటింగ్. ఇక నటీనటుల విషయానికొస్తే ఇందులో ప్రియమణి కథానాయికగా నటించనుంది. చిత్రాన్ని 2020 మొదటి సగంలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సురేష్ బాబు.

సంబంధిత సమాచారం :

X
More