మెహ్రీన్ కే ఎందుకిలా జరుగుతుంది !

మెహ్రీన్ కే ఎందుకిలా జరుగుతుంది !

Published on Oct 8, 2018 3:01 PM IST

Mehreen1

నాని నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ’ కథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ బ్యూటీ మెహ్రీన్ కౌర్. ఈ చిత్రం విజయం సాధించడంతో త్వరగానే మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇక మెహ్రీన్ గత ఏడాది ‘నెంజిల్‌ తునివిరుందాల్‌’ అనే చిత్రం తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల అయ్యాక మెహ్రీన్ నటించిన సన్నివేశాలు చాలా వరకు ఎడిటింగ్ లో ఎగిరిపోయాయి. తరువాత ఈవిషయంలో ఆమె కు దర్శకుడు క్షమాపణలు చెప్పాడు.

ఇక తాజాగా మళ్ళీ ఆమె విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రంలో నటించింది. ఈచిత్రంతోనైనా అక్కడ బిజీ అవ్వాలన్న ఆమె కల తీరలేదు. ఈచిత్రంలోఆమె విలేకరి పాత్రలో నటించింది. అసలే నిడివి తక్కువ పైగా అస్సలు గుర్త్తింపు లేని పాత్ర కావడంతో ఈ చిత్రం తో కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. మరి అక్కడ మరిన్ని అవకాశలకోసం ప్రయత్నిస్తుందో లేక తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి సరిపెట్టుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఆమె విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ ‘2 అనే చిత్రంలోను అలాగే సుదీర్ బాబు తో మరో చిత్రంలో నటిస్తుంది.

తాజా వార్తలు