గోవా బీచ్ లో ‘జ్యోతి లక్ష్మీ’ ఏం చేస్తోంది.?

గోవా బీచ్ లో ‘జ్యోతి లక్ష్మీ’ ఏం చేస్తోంది.?

Published on Mar 26, 2015 3:02 PM IST

charmi
ఇటీవలే విడుదలైన ‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కెరీర్లో మొదటి సారిగా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘జ్యోతిలక్ష్మీ’. ప్రముఖ హీరోయిన్ ఛార్మీ టైటిల్ రోల్ లో కనిపించనుంది. మహిళా దినోత్సవం రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర టీం ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో షూట్ చేసారు. కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ చిత్ర టీం జ్యోతి లక్ష్మీ సెకండ్ షెడ్యూల్ ని గోవాలో స్టార్ట్ చేసారు. ప్రస్తుతం గోవా బీచ్ లో ఛార్మీ పై కొన్ని గ్లామరస్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అక్కడే కొన్ని పాటలను కూడా షూట్ చేయనున్నారు.

ఈ సినిమాలో ఛార్మీ అల్ట్రా మోడ్రన్ గా కనిపించడమే కాకుండా హాట్ హాట్ గా కూడా కనిపించనుందని సమాచారం. ఈ సినిమా కోసం ఛార్మీ వెయిట్ కూడా తగ్గి మరింత స్లిమ్ అయ్యింది. పూరి జగన్నాధ్ నేడు మహిళ దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేసిన జ్యోతి లక్ష్మీ మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్ టీజర్ అందరినీ బాగా ఇంప్రెస్ చేసింది. మల్లాడి వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవలా ఆధారంగా పూరి ఈ సినిమా తీస్తున్నాడు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా త్వరగా ఈ సినిమా షూట్ ని ఫినిష్ చేసి సమ్మర్ చివర్లోనే ఈ సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు