సూర్య కోసం వచ్చే స్టార్ హీరో ఎవరో ?

Published on May 23, 2019 12:00 am IST

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఎన్ జి కె’. ఈ చిత్రం మే 31వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. కాగా తాజాగా తెలుగు వర్షన్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు ఎన్.జి.కే మేకర్స్. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హల్ లో ఈ ఈవెంట్ జరగనుంది.

అయితే ఈ ఈవెంట్ కోసం తెలుగులో ఓ స్టార్ హీరోను ఆహ్వానించాలని చిత్రబృందం భావిస్తోంది. మరి తెలుగులో ఏ స్టార్ హీరో సూర్య కోసం ఈ ఈవెంట్ కి వస్తాడో చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సెల్వరాఘవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More