మహేష్ కి ఆ ఇంటెలిజెంట్ విలన్ దొరికాడా?

Published on Jul 15, 2020 7:14 am IST

మహేష్ నెక్స్ట్ సర్కారు వారి పాట కోసం దర్శకుడు భారీ క్యాస్టింగ్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ప్రముఖ నటులను సంప్రదిస్తున్నారు. కథలో కీలకమైన విలన్ రోల్ హీరో మహేష్ కి సవాల్ విసిరేలా ఉంటుందట. అందుకే టాలెంటెడ్ యాక్టర్ కోసం వెతుకుతున్నారు. ఇంటెలిజెంట్ విలన్ గా హీరోని ముప్పతిప్పలు పెట్టే ఆ పాత్ర కోసం అరవింద స్వామి, ఉపేంద్ర మరియు సుధీప్ వంటి నటుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది.

కాగా వీరిలో ఎవరినీ అధికారికంగా ప్రకటించ లేదు. మరి చూడాలి ఆ క్రేజీ రోల్ ఎవరికి దక్కుతుందో. ఇక సర్కారు వారి పాట చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More