కొరటాల తర్వాత హీరో ఎన్టీఆరేనా ?

Published on Apr 4, 2020 3:00 am IST

మాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో ప్రముఖంగా వినిపించే పేరు కొరటాల శివ. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన సినిమా. అందుకే చోటా హీరోల దగ్గర నుంచి ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ వరకు ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు.

కాగా కొర‌టాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల చేయబోయే సినిమా కూడా ఓ స్టార్ హీరోతోనేట. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ తో సినిమా త‌ర్వాత కొర‌టాల, ఎన్టీయార్‌ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట. 2021లో ఈ చిత్రం మొదలవనుందని ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఐతే ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :

X
More