బిగ్ బాస్- ఎలిమినేట్ అయ్యేది వారిద్దరిలో ఒకరట…?

Published on Aug 1, 2019 10:08 am IST

మరో మూడు రోజులలో బిగ్ బాస్ ఇంటి సభ్యుల నుండి మరొకరు వెళ్లిపోనున్నారు. గత వారం ఎలిమేషన్ కొరకు నామినేట్ అయిన ఆరుగురు ఇంటి సభ్యుల నుండి నటి హేమ ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ వారం ఎలిమినేషన్ కి గాను శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేశ్ విట్టా, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం తో కలిపి మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ ఐయ్యారు. వీరిలో శ్రీముఖి, హీరో వరుణ్ తో పాటు అతని భార్య వితికా షేరు ఉండటం గమనార్హం.

ఐతే ఈ ఎనిమిది మంది ఇంటి సభ్యులనుండి ఈవారం ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. బయట పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ని మెయింటైన్ చేస్తున్న శ్రీ ముఖి ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదని చెప్పాలి. గ్లామర్ టచ్ కొరకు ఆమెకు భారీ పారితోషకం చెల్లించి షోలోకి తీసుకున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె సేఫ్ అని చెప్పొచ్చు. ఇక వరుణ్ సందేశ్ ఒకప్పటి హీరో కావడంతో పాటు,ఉన్న ఇంటి సభ్యులందరిలో కొంచెం ఎక్కువ సెలెబ్రిటీ హోదా కలిగిన వారు కనుక ఆయన కూడా ఎలిమినేట్ అయ్యేఅవకాశం లేదని కొందరి వాదన.

నామినేట్ కాబడిన ఎనిమిది మంది సభ్యులలో జాఫర్, వితికా షేరు లకు మిగతా వారికంటే తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యేఅవకాశం ఉండగా, వితికా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని సమాచారం. గతవారం అందరూ ఊహించిన విధంగానే నటి హేమ ఎలిమినేట్ అయిన తరుణంలో ఇలాంటి ఊహాగానాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత సమాచారం :