నాగార్జున కార్తీల మల్టీ స్టారర్ చిత్రం నుండి బయటకొచ్చి ప్రస్తుతం కోర్టు సమన్లను ఎదురుకుంటున్న శృతికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం మరో హీరోయిన్ వేటలో వున్నట్టు తెలుస్తుంది.
సంబంధిత వర్గాల సమాచారం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఈ పాత్రకు తమన్నాను ఎంపిక చేసుకునే పనిలో వున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అవారా విజయంతో తమన్నా, కార్తీలు లక్కీ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి తమన్నా ఎంపిక సరైనదే అని ఫిలింనగర్ వాసుల అభిప్రాయం.


